నేను ఇది ఎందుకు వ్రాస్తున్నానో తెలుసుకోవడానికి ఇది వ్రాస్తున్నాను. అసలు ఏమన్నా రాయడానికి ముందునుంచే అనుకొన్న ఏమన్నా నిర్దేశం ఉండాలా? అంటే ఆ goal కి తగ్గటూగా ఒక ఆలోచనకు వేలాడుతూ ఆ చీకటి నూతిలోకి తొంగి చూసి భయం వేసినపుడు అదే ఆలోచనా తాడుతో పైకి వచ్చి మళ్ళీ పైకి క్రిందకు వస్తూ వెళ్తూ ఆయాసం వచ్చినప్పుడు ఆ వ్రాతకు అంతం పలుకుతారా? అస్సలు ఏ తాడు లేకుండా ఆ చీకటి నూతి లోకి దూకితే ఏమవుతుంది? మళ్ళీ పైకి రాగలమా?
నూతిలో లోలోపలికి వెళ్తుంటే వెలుతురు కనిపిస్తోంది. ఒక దశానిర్దేశం లేకుండా అలాగే వెళ్తున్నా.. ఇంత ప్రశాంతంగా పాతవన్నీ వదిలేసి వెళ్తూ ఉంటే ,ఈ అసంబద్ధ క్షణాన అడుగు తీసి ఇంకొక అడుగు ముందుకు ఎందుకు వేస్తున్నాను? ఇప్పుడు ఆగిపోవాలా? లేక నడుస్తూ ముందుకు వెళ్తే సమాధానం దొర్కుతుందా? అలాగే ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్నా.. ఇది ఒక ఆలోచనారహిత క్షణం అని గుర్తిస్తూనే ఆ క్షణం పోయింది. మళ్ళీ ఏమన్నా రాయలంటే ఇంకొక ఆలోచన.ఆలోచించకుండా ఏమీ చెయ్యలేమా? అస్సలు ఒక ఆలోచనకు మరో ఆలోచనకు మధ్య ఏం జరుగుతోందన్న ఆలోచనతోటే ముందుకు పోతున్నా.. ఆలోచనారాహిత్యాన్ని మాటల్లో పెట్టలేమేమో అన్న ఆలోచన. మళ్ళీ శూన్యం . అదే చీకటి నుయ్యి మళ్ళీ వచ్చిందనుకుంట ..! ఎంత లోపలికి వెళ్తున్నా చీకటి గానే ఉంది. ..నా ఆలోచనలతో సతమతమవుతున్నా..
-పీపుదీపు
Friday, 19 March 2010
Wednesday, 27 January 2010
వేమన పద్యం..
సకల శాస్త్రములను చదివియు వ్రాసియు
తెలియగలరు చావు తెలియలేరు
చావు తలియలేని చదువులవేలరా?
విశ్వదాభిరామ వినురవేమ...
తెలియగలరు చావు తెలియలేరు
చావు తలియలేని చదువులవేలరా?
విశ్వదాభిరామ వినురవేమ...
Tuesday, 26 January 2010
రాహుల్ సంకృత్యాయన్ (Rahul sankrityayan )
సైర్కర్ దునియాకి గాఫిల్ జిందగానీ ఫిర్ కహా
జిందగీ అగర్ కుచ్ రహీతో నౌజవానీ ఫిర్ కహా
ఓ మూర్ఖుడా! మళ్ళీ ఈ జీవితం దుర్లభం. అందుకే ప్రపంచ
పర్యటన చయ్. ఒకవేళ జీవితం కొంత మిగిలినా మళ్ళీ యవ్వనం తిరిగిరాదు.
"కేదార్, వింటున్నావా! లే, పర్యటనకు బయలుదే రు.
ఇంకా ఆలోచిస్తావేం?" మా మాష్టారు నాకోసమే ఈ ప్రద్యాన్ని
చెబుతున్నట్టుగా ఉంది.
ఇంత గొప్ప విషయం తెలిసిన ఈయన ఇంకా ఎందుకు ఈ
తరగతి గదిలో చాక్ పీస్ సుద్దను అంటించుకుంటూ, బెత్తాన్ని
ఆడిస్తూ, రోజూ ఒకే చోట నిలబడి పాఠం ఎలా చెబుతున్నాడో
నని ఆలోచించట్లేదు.
కిటికీలోంచి కలబడుతున్న వేప కొమ్మమీది పిచ్చుక మీదే
ఉంది నా చూపు.
ఆ పక్షిలా నేనూ ఎలా ఎగిరిపోవడం?

Friday, 8 January 2010
వంశీ కృష్ణ కొన్ని నేనులు (vamsi krishna)
వంశీ కృష్ణ కొన్ని నేనులు లోనిది ఇది .....
నిన్న రాత్రి మృత్యువు నా కలలోకి తొంగి చూసి
రేపు ఉదయం తలుపు తట్టనా అంది
అమాయకమయిన నాభార్య మొహం
తన నునులేత ఒంటిపై నా వదలని మోహం
గుర్తు కొచ్చాయి...?
పసితనన్ని వదలని మా అమ్మాయి
ఒకానొక అవ్యక్త ప్రేయసి కనుదోయి
ఆరడి పెట్టాయి ...!
మృత్యువు వంక తిరిగి
యింత తొందరగా నా ... అన్నాను.
తను నవ్వేసి వెళ్ళిపోయింది.
ఓ యాభై ఏళ్ల తర్వాత ...
మృత్యువు ముందు
దీనంగా ... హీనంగా ...
కరుణిoచమని వేడుతూ ... నేను

Saturday, 2 January 2010
చలం .. గీతాంజలి (gudapaati venkata chalam)
చలం గీతాంజలి లో మొదటి పేజీ ....
వాళ్ళకి తోవ తెలుసు. ఇరుకు సంధుగుండా నిన్ను
వెతుకుతో వెళ్ళారు. కానీ నాకు ఏమీ తెలీదు. ఇటూ
అటూ తిరుగుతూ రాత్రిలోకి వెళ్ళి పోయినాను.
చీకట్లో నిన్ను చూసి భయపడేంత నేర్చుకోలేధు నేను.
అందుకని, నాకు తెలీకుండానే నీ గడప చెరుకున్నాను.
సరైన తోవన రాలేదని, విజ్ఞులు నన్ను తిట్టి పొమ్మన్నారు.
సందేహిస్తో వెనక్కి తిరిగాను. కానీ నువ్వు నా చేతిని
గట్టిగా పట్టుకుని ఆపేశావు. వారి చివాట్లు రోజు రోజుకీ
ఎక్కువౌతున్నాయి.

తెలుగులో .. పరిచయం..
పశ్చిమ గోదావరి జిల్లా ,వేలివెన్ను గ్రామం ... 19 సంవత్సరాలు ... ఇంజనీరింగ్ చదువుతున్నా... తెలుగు తియ్యదనం , దాని మీద ప్రేమ రోజురోజుకూ ఎక్కువవుతోంది. కవితలు ,చలం వర్ణనలు చదువుతూ దాని తియ్యదనం ఆస్వాదిస్తూ కాలం గడుపుతున్నా ఈమధ్య ..
నన్ను హత్తుకునే కవితలను , చలం పుస్తకాల గురించి, సినేమాలు(all languages) , జీవితం , చావు , ప్రేమ ....
నా అభిప్రాయాలు అన్నీ ఈ రచనా తంత్రి లో ....
నన్ను హత్తుకునే కవితలను , చలం పుస్తకాల గురించి, సినేమాలు(all languages) , జీవితం , చావు , ప్రేమ ....
నా అభిప్రాయాలు అన్నీ ఈ రచనా తంత్రి లో ....
Subscribe to:
Posts (Atom)